News June 4, 2024

రికార్డు బ్రేక్ దిశగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి

image

గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన 195189 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 344736 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 2,32,467 ఓట్లు నమోదయ్యాయి. కాగా గుంటూరు ఎంపీ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో కూటమి స్పష్టమైన మెజారిటీ రావడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది.

Similar News

News November 1, 2025

ANU: బీఈడీ, ఎల్‌ఎల్‌ఎం రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన పలు యూజీ, పీజీ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. తృతీయ సెమిస్టర్ బిఈడి, ఎల్.ఎల్.ఎమ్ పరీక్ష ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని తెలిపారు.

News November 1, 2025

ANU: యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీటెక్, బీఈడి, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ, ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా అందజేయాలని సూచించారు. రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ.1860 చొప్పున, జవాబు పత్రాల వ్యక్తిగత పరిశీలన, జిరాక్స్ కాపీలకు రూ.2190 చొప్పున చెల్లించాలన్నారు.

News November 1, 2025

గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.