News June 4, 2024

రికార్డు బ్రేక్ దిశగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి

image

గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన 195189 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 344736 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 2,32,467 ఓట్లు నమోదయ్యాయి. కాగా గుంటూరు ఎంపీ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో కూటమి స్పష్టమైన మెజారిటీ రావడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది.

Similar News

News November 3, 2024

అమరావతికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఎం

image

రాజధాని అమరావతికి అప్పు కాదు.. కేంద్ర ప్రభుత్వం రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు అన్నారు. శనివారం అమరావతి తుళ్లూరులో సీఆర్డీఏ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబురావు మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చిత పరిస్థితి మళ్లీ తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా, పటిష్ఠంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

News November 3, 2024

హంతకులకు కొమ్ము కాస్తున్నారు : అంబటి

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక శైలజ మృతి బాధాకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాలిక హత్య జరిగి నాలుగు నెలలు దాటిన ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్ బాలిక కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నా.. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి హంతకులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

News November 2, 2024

మాచర్ల: ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

image

మాచర్లలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి తన రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో సహచర విద్యార్థులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఇప్పటి వరకు తనతో పాటూ ఉన్న స్నేహితుడు చనిపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.