News April 3, 2025
రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్‌గా ECoR అవతరించిందని పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
జనసేనలో చేరిన విశాఖ వైసీపీ కార్పోరేటర్లు

విశాఖలో మరోసారి YCPకి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు కార్పోరేటర్లు గురువారం జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ వారికి కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. విశాఖ సౌత్ MLA వంశీ కృష్ణ ఆధ్వర్యంలో 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు చేరారు. 91, 92 డివిజన్ల కార్పొరేటర్లు జ్యోత్స్న, బెహరా స్వర్ణలత సైతం జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు.
News April 17, 2025
విశాఖ: POCSO చట్టంపై అవగాహనా కల్పించిన హోం మంత్రి

వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో మహిళల రక్షణ, POCSO చట్టంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ప్రేమ ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రులు కోసం ఒక్క క్షణం ఆలోచించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. CP శంకబ్రాత బాగ్చి ఉన్నారు.
News April 17, 2025
విశాఖ: తీవ్రంగా గాయపడిన నాగరాజు మృతి

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జల్లూరు నాగరాజు (58) KGHలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. కోటవురట్ల శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ప్రమాదకరమైన బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.