News August 20, 2024

రికార్డు సృష్టించిన కరీంనగర్ ఆర్టీసీ రీజియన్

image

కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రీజియన్‌లో 5.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 4.40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పగా 107 ఓఆర్ వచ్చింది. మూడు రోజుల్లో 450 అదనపు ట్రిప్పుల బస్సులను నడిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహాయిస్తే కరీంనగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలిచింది.

Similar News

News November 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య. @ మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

News November 26, 2024

పెద్దపల్లి: దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!

image

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్న పూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో పని చేసే వంట మనిషి నగ్న పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ బాలికతో చెప్పింది. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులను ఆశ్రయించగా సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 26, 2024

కోరుట్ల: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్

image

NZB జిల్లా న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. NZBకు చెందిన కాంత్రికుమార్‌కు కోరుట్లకు చెందిన మానసతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్ద కూతురు నేహశ్రీకి మానసిక ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది కూతురితో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.