News April 2, 2025

రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

image

విజయవాడ రైల్వే డివిజన్‌కు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,386.61 కోట్ల స్థూల ఆదాయం లభించిందని డివిజన్ రైల్వే మేనేజర్(DRM) నరేంద్ర పాటిల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక ఆదాయమన్నారు. 38.322 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.4,239.74 కోట్ల ఆదాయం డివిజన్‌కు లభించిందని DRM పేర్కొన్నారు.

Similar News

News April 4, 2025

బ్లడ్‌బాత్.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

image

అమెరికా సుంకాల వేళ భారత స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోవడంతో సుమారు రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ONGC, హిందాల్కో, సిప్లా షేర్లు అత్యధికంగా 6శాతం చొప్పున నష్టపోయాయి. టారిఫ్ దెబ్బకు ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల షేర్లు కుదేలయ్యాయి.

News April 4, 2025

సిరిసిల్ల: అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయాలి: అదనపు కలెక్టర్

image

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ రేషన్ కార్డుల జారీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజాపాలన, మీ సేవా, ఇతర మార్గాల ద్వారా రేషన్ కార్డుల జారీ కోసం వచ్చిన 30,977 దరఖాస్తులు వచ్చాయన్నారు.

News April 4, 2025

నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలి- జేసీ

image

బాపట్ల జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. నాటుసారా ఆరోగ్యానికి హానికరం అన్నారు.

error: Content is protected !!