News November 20, 2024
రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి: భట్టి

బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాల వల్లనే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లను ప్రజా ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. దేశంలో ఒకే రోజు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పుట్టకోట మహిళలు కోరిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఆర్డీఓ, హౌసింగ్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముదిగొండ వల్లభి యువత కోరిన విధంగా గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని సూచించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.