News February 7, 2026
రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. జపాన్ మ్యాగజైన్‌పై సోలో ఫొటో

రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్‌కు చెందిన పాపులర్ లైఫ్‌స్టైల్ వీక్లీ మ్యాగజైన్ ‘Anan’ ఫిబ్రవరి ఎడిషన్ బ్యాక్ కవర్‌పై సోలోగా కనిపించిన తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత జపాన్‌లో ఏర్పడిన భారీ ఫ్యాన్‌బేస్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. గతంలో ‘RRR’ సక్సెస్ తర్వాత 2023లో రామ్‌చరణ్, NTR కలిసి కవర్‌పై కనిపించగా, ఈసారి ప్రభాస్ సోలోగా మెరిశారు.
Similar News
News March 17, 2026
మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.
News March 17, 2026
24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్

వినియోగదారులకు వేగవంతమైన డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్ పోస్ట్’, ‘48 స్పీడ్ పోస్ట్’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. తొలిదశలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సదుపాయం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. వస్తువులు పోస్టు చేసిన మరుసటి రోజే డెలివరీ అవ్వకపోతే పేమెంట్ తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. OTPతో డెలివరీ తీసుకోవచ్చు.
News March 17, 2026
మత మార్పిడులపై ఉక్కుపాదం.. కీలక బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

బలవంతం, మోసం, ప్రలోభం, వివాహాల ద్వారా జరిగే మత మార్పిడులను నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్-2026కు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తారు. మైనర్, SC, ST, మహిళలు, రోగులతోపాటు సామూహిక మత మార్పిడులకు పాల్పడితే అదనంగా రూ.5 లక్షలు ఫైన్ ఉంటుంది. పదేపదే ఇవే నేరాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల జరిమానా విధిస్తారు.


