News June 4, 2024
రికార్డ్.. 7వసారి MLAగా గోరట్ల

ఉమ్మడి తూ.గో జిల్లాలో రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బోణీ కొట్టారు. తొలి విజయం నమోదు చేశారు. 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 61,564 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఈయన 10వసారి పోటీ చేయగా.. 7వ సారి MLAగా గెలిచారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయినకు 60,102 ఓట్లు వచ్చాయి.
Similar News
News October 26, 2025
రాజమండ్రి: పాపికొండల విహారయాత్ర బోట్ల నిలిపివేత

తుపాన్ కారణంగా రాజమండ్రి నుంచి పాపికొండల విహారయాత్రకు బయలుదేరే బోట్లను నిలిపివేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని ఆమె హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు.
News October 26, 2025
తూ.గో: 1577 హెక్టార్లలో పంట నష్టం

తుపాను ప్రభావంతో శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 1577.38 హెక్టార్లలో పంటకు పాక్షిక నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. దీనిలో 1374 హెక్టార్లలో వరి పంట నేలవాలగా, 183.29 హెక్టార్లు నీట మునిగాయన్నారు. 13 మండలాల పరిధిలోని 74 గ్రామాలలో 2,176 మంది రైతులకు పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన వెల్లడించారు.
News October 26, 2025
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కంట్రోల్ రూములు ఇవే.!

జిల్లా కంట్రోల్ రూమ్ ➢ 0883–2944455 రాజమహేంద్రవరం ఆర్డీఓ ➢0883–2442344
రాజమహేంద్రవరం అర్బన్ ➢0883–2940695 రాజమహేంద్రవరం రూరల్➢9849903860
కడియం➢6301523482 రాజానగరం➢9494546001 రంగంపేట➢ 9393931667 కోరుకొండ➢9154474851 అనపర్తి➢9441386920 బిక్కవోలు➢ 9849903913 సీతానగరం➢9177096888 గోకవరం➢9491385060 కాల్ చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.


