News November 18, 2024

రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వానికి నివేదిక..!

image

స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరిస్తూ నివేదికను ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమీషన్ ఛైర్మన్ బూసాని వేంకటేశ్వర రావు అన్నారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ జరిగింది.

Similar News

News December 4, 2024

పోస్టల్ శాఖలో స్థానిక అభ్యర్థులను ఎంపిక చేయాలి: ఎంపీ రఘురాంరెడ్డి

image

 తెలంగాణలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టల్ శాఖ ఉద్యోగాలకు 95శాతo తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో పోస్టల్ శాఖ కార్యదర్శి వందిత కౌల్ కు బుధవారం ఢిల్లీలోని పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పదవ తరగతిలో గ్రేడ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు.

News December 4, 2024

సత్తుపల్లి: రేపు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభం

image

సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్క్‌ను రాష్ట్ర మంత్రులతో గురువారం ప్రారంభిస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పాల్గొంటారని చెప్పారు. కావున మీడియా మిత్రులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.

News December 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన