News March 22, 2025
రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోండి: నిర్మల్ కలెక్టర్

ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ)కు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే పలువురు దరఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిల్లో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ రుసుంలో 25 శాతం రాయితీ కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 26, 2026
అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
News February 26, 2026
GHMC: నిధుల విభజన వేళ రూ.300 కోట్ల దోపిడీ?

GHMC నిధుల విభజన కసరత్తు వేళ వ్యవస్థీకృత దోపిడీపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ డోర్ నంబరింగ్ పేరిట ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సర్వర్లకు మళ్లుతోంది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలో బాగున్న రోడ్లనే కూల్చి వేస్తూ ‘సిండికేట్ కాంట్రాక్టర్లు’ ఏటా రూ.300 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. హరితహారం ‘గోస్ట్ ఆడిట్’ వెనుక బినామీల బాగోతంపై విజిలెన్స్ నివేదికలు సిద్ధమవుతున్నాయి.
News February 26, 2026
CM మాట ఇచ్చారు.. అధికారులు పని మొదలెట్టారు!

తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రజావేదికలో సనమండ్ర పోసియ్యకు ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాలతో హౌసింగ్ అధికారులు, MRO గురువారం లబ్ధిదారుడి అసంపూర్తి గృహాన్ని పరిశీలించారు. హౌసింగ్ విభాగం నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. CM ఆదేశాలతో పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


