News February 14, 2025
రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకం: డీపీవో

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకమని జిల్లా పంచాయతి అధికారి నారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి, కాటారం డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
Similar News
News February 24, 2026
కాజీపేట షార్ట్ టర్మ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ ఐటీఐ లో PMKVY 4.0 స్కీమ్ కింద ‘ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్’ తో పాటు ‘CNC ఆపరేటర్’ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. మూడు నెలల శిక్షణ మార్చి 2, 2026 నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి గల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు.
News February 24, 2026
నాగర్‌కర్నూల్: ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఎస్పీ కీలక ఆదేశాలు

జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ కీలక సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, డీజేలు, లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News February 24, 2026
వనపర్తి: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

వనపర్తి జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం 633 మంది ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు మంగళవారం వెల్లడించారు.


