News February 1, 2025
రిటైర్డ్ హైకోర్టు జడ్జికి తిరుపతి కలెక్టర్ స్వాగతం

తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి శుక్రవారం పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆయనకు స్వాగతం పలికారు. బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.
Similar News
News February 8, 2025
ప్రాంతీయ పార్టీలకు గడ్డుకాలం.. నెక్స్ట్ టార్గెట్ బెంగాలేనా?

దేశంలో ప్రాంతీయ పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణలో BRS, ఒడిశాలో బిజూ జనతాదళ్, MHలో శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. ఏపీలో టీడీపీ, బిహార్‌లో JDU ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాయి. ప.బెంగాల్‌లో మమతా బెనర్జీ, TNలో స్టాలిన్ బలంగా నిలబడ్డారు. మోదీ నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీ కామెంట్?
News February 8, 2025
కేన్ విలియమ్సన్ మరో ఘనత

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో ఘనత అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టు, వన్డే, టీ20లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన 17వ ఆటగాడిగా కేన్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18,685 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (18,672) రికార్డును చెరిపేశారు. పాక్‌తో జరుగుతున్న వన్డేలో కేన్ ఈ ఫీట్ సాధించారు. ఈ జాబితాలో సచిన్ (34,357) అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.
News February 8, 2025
ములకలచెరువు ప్రమాదంలో మరొకరు మృతి

ములకలచెరువులో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని SI నరసింహుడు తెలిపారు. మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన సోమశేఖర్ భార్య కవిత, కొడుకు రెడ్డిశేఖర్(5), కుమార్తె సిద్దేశ్వరి కదిరిలో బంధువుల అంత్యక్రియలకు బైకుపై వెళ్తుండగా ములకలచెరువు వద్ద వాహనం ఢీకొట్టడంతో <<15397818>>తండ్రీ కుమార్తె చనిపోగా<<>>, భార్య, కుమారుడిని చికిత్త నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితమే రెడ్డిశేఖర్ చనిపోయాడు.