News November 3, 2024
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడం దుర్మార్గం: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆదివారం సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉపాధ్యాయుడు, టీపీటీఎఫ్ నాయకులు పొన్నమల్ల రాములు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని ఉద్యోగాలకు విరమణ ఉంటుంది కానీ ఉపాధ్యాయ వృత్తికి విరమణ ఉండదన్నారు. రాములు ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారు. సామాజిక బాధ్యతకు కాదన్నారు.
Similar News
News December 5, 2025
మెదక్: 3వ విడత 2వ రోజు 368 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో రెండవ రోజు 368 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-43, కౌడిపల్లి-59, కుల్చారం-48, మాసాయిపేట-18, నర్సాపూర్-75, శివంపేట-73, వెల్దుర్తి-52 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 1522 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నేడు చివరి రోజుకావడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.
News December 5, 2025
మెదక్: రైతుల కష్టాలపై విద్యార్థుల ప్రదర్శన అదుర్స్

మెదక్ జిల్లా సైన్స్ ఫెయిర్లో నవాబుపేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రైతుల సమస్యలపై రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. పంట కోత అనంతరం రోడ్లపై ధాన్యం ఆరబెట్టడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ధాన్యాన్ని ఆరబెట్టడం, ఎత్తడం, కుప్పలు చేయడంలో ఒకే వ్యక్తి ఉపయోగించే సులభమైన యంత్రాన్ని ప్రదర్శించారు. టీచర్ అశోక్ దేవాజీ మార్గదర్శకత్వంలో దీన్ని రూపొందించారు.
News December 5, 2025
మెదక్ జిల్లాలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 160 పంచాయతీలకు 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అదే విదంగా జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరిగే 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. ఇందులో 14 గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయినట్లు వివరించారు.


