News April 3, 2025
రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి: జేసీ

అనకాపల్లి జిల్లాలో చేపడుతున్న రెండవ విడత రీసర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె బుధవారం మాట్లాడుతూ.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ముందుగా భూ యజమానులకు నోటీసులు అందజేయాలని తెలిపారు. సర్వేకు అవసరమైన సిబ్బందిని కేటాయించడం జరుగుతుందన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News October 14, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. లేఅవుట్లలో పార్కులు, డెడ్ ఎండ్ రోడ్ల కబ్జాలు, వరద కాలువల మలుపులు ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నారు. రావిర్యాల పెద్ద చెరువు ప్రభావంపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించామన్నారు.

LOC వెంబడి ఉగ్రమూక చొరబాటు యత్నం!

జమ్మూకశ్మీర్లోని కుప్వారా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్థాన్ వైపు నుంచి కొన్ని అనుమానాస్పద కదలికలను భారత ఆర్మీ గుర్తించింది. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అటుగా జవాన్లు కాల్పులు జరిపారు. పాక్ వైపు నుంచి సరిహద్దు దాటే ప్రయత్నం జరిగినట్లు ఆర్మీ భావిస్తోంది. ప్రస్తుతం ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.