News April 3, 2025
రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలి: జేసీ

అనకాపల్లి జిల్లాలో చేపడుతున్న రెండవ విడత రీసర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆమె బుధవారం మాట్లాడుతూ.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ముందుగా భూ యజమానులకు నోటీసులు అందజేయాలని తెలిపారు. సర్వేకు అవసరమైన సిబ్బందిని కేటాయించడం జరుగుతుందన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News April 21, 2025
బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి: ADB SP

బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ADB SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మొత్తం 12 మంది ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం అనంతరం రిపోర్టు దాఖలు చేయాలని సూచించారు.
News April 21, 2025
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ADBలోని సాయుధ ముఖ్య కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులను నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సమయపాలన పాటిస్తూ సక్రమంగా నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.
News April 21, 2025
HNK: కొప్పుల రాజును కలిసిన ఎమ్మెల్యేలు

హనుమకొండలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజును ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు కలిసి సన్మానించారు. అనంతరం కాసేపు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. వారితో పాటు పలువురు నేతలు ఉన్నారు.