News January 9, 2025
రీసర్వేలో కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్
రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేపై వర్క్‌షాప్ నిర్వహించారు.
Similar News
News January 26, 2025
కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అవార్డు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును కైవశం చేసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది కృష్ణాజిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా పూర్తి చేశారు.
News January 25, 2025
గన్నవరం హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్
గన్నవరం జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. 60 సంవత్సరాల వృద్ధుడు రోడ్డు దాటుతుండగా లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వృద్ధుడు లారీ చక్రాల కిందపడి స్పాట్‌లోనే మృతి చెందాడు. గన్నవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 25, 2025
పెనమలూరు: బ్యాంక్ ఉద్యోగికి భారీ మోసం
బ్యాంక్‌లో అపార అనుభవం ఉన్న ఓ విశ్రాంత బ్యాంక్ అధికారికి సైబర్ నేరగాళ్లు కళ్లెం వేశారు. పెనమలూరు పోలీసుల వివరాల మేరకు.. తాడిగడపకు చెందిన ఉమామహేశ్వర గుప్తా అనుమతులు లేకుండానే కొందరు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పడంతో ఆయన నమ్మి 9సార్లు రూ.78.33 లక్షలు పంపించారు. తిరిగి అడుగగా వారు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు.