News April 9, 2025
రీసర్వే డేటాను వేగంగా నమోదు చేయండి: భార్గవ్ తేజ

గుంటూరు జిల్లాలో భూముల రీసర్వే పూర్తైన 14 గ్రామాల వివరాలను ఆన్లైన్లో సరైన విధంగా నమోదు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రీ సర్వేలో సేకరించిన డేటా తప్పులు లేకుండా నమోదు కావాలని, ఇది భవిష్యత్తులో భూ వివాదాలను నివారించే దిశగా కీలకంగా పనిచేస్తుందన్నారు. గ్రౌండ్ ట్రూ థింగ్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
Similar News
News April 20, 2025
గుంటూరు జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

గుంటూరు కలెక్టరేట్లో జరిగిన రెవెన్యూ వర్క్షాప్లో కలెక్టర్ నాగలక్ష్మి భూ సమస్యలపై కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి ఎక్కువగా భూ రికార్డుల, వెబ్ల్యాండ్ లోపాల, రీసర్వే అంశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధికారులు త్వరగా గుర్తించి పరిష్కరించకపోతే ప్రజలు విసుగుతో అధికార కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అధికారుల సమన్వయం వల్లే సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయన్నారు.
News April 20, 2025
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం : DEO

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.
News April 20, 2025
పథకాల అమలులో కూటమి విఫలం: వైవీ సుబ్బారెడ్డి

ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎంపీ వై.వి సుబ్బారెడ్డి ఆరోపించారు. గుంటూరు నగర పర్యటనలో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని హామీలకు అనుగుణంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ శ్రేణులను భయపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఫైర్ అయ్యారు.