News October 6, 2025

రీ-ఓపెన్ అయిన ఫిర్యాదులపై ఫోకస్ పెట్టాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం 182 అర్జీలు అందాయని, వాటిని నాణ్యతతో, గడువులోగా పరిష్కరించాలన్నారు. రీ-ఓపెన్ అయిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ అంశాలలో సంతృప్తి స్థాయి పెంచాలని సూచించారు.

Similar News

News March 7, 2026

ధర్మపురి: నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు

image

బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నపూర్‌లో హత్యాయత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ధమ్మ తిరుపతిని అదే గ్రామానికి చెందిన గట్టు గంగారాం బస్టాండ్ వద్ద కులం పేరుతో దూషించి కొట్టాడు. గట్టు గణేశ్ బంధువు గట్టు శ్రవణ్‌లతో కలిసి తిరుపతిపై దాడి చేశారు. కేసులో BNS సెక్షన్లు, SC/ST చట్టం కింద కేసు నమోదు చేసి, అదనంగా 109(1) సెక్షన్ చేర్చినట్లు సీఐ రామ్ నరసింహ రెడ్డి తెలిపారు.

News March 7, 2026

వామ్మో ఎండలు.. 40 డిగ్రీలు దాటేసిన టెంపరేచర్!

image

TG: మార్చి తొలి వారంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాబోయే 3 రోజులు పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా) నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.

News March 6, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* నాగాయలంక: 18 నెలల పసికందును కాటేసిన పాము
వీరవల్లి: ల్యాబ్ అసిస్టెంట్‌పై దాడి ఘటనలో విద్యార్థులకు కౌన్సెలింగ్
* విజయవాడ: OLX పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
* విజయవాడలో బైక్ స్టంట్స్ చేస్తున్న యువకులకు కౌన్సెలింగ్
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కుంబాభిషేకం
* అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే