News February 28, 2025
రీ సర్వేను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

యాడికి మండలం చందన రెవెన్యూ గ్రామాల్లో గురువారం రీ సర్వేను జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పరిశీలించారు. రీ సర్వే జరుగుతున్న విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. రీ సర్వేకు వెళ్లే ముందు రోజే సంబంధిత రైతులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ రైతులు హాజరు కాకపోతే మూడుసార్లు అవకాశం ఇవ్వాలన్నారు. రీ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలన్నారు.
Similar News
News March 23, 2025
గుత్తిలో కేజీ చికెన్ రూ.170

అనంతపురం జిల్లా గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170-180లుగా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150లతో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700-750లుగా ఉంది.
News March 23, 2025
JNTUలో బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. సిలబస్‌లో మార్పులు

అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీలోని వీసీ కాన్పరెన్స్ హాల్‌లో శనివారం బోర్డు ఆఫ్ స్టడీస్ (BOS) సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని బీటెక్ 3, 4 సంవత్సరాలకు R23 సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు భానుమూర్తి, సత్యనారాయణ, పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
News March 22, 2025
ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.