News February 16, 2025
రీ సర్వే విధానాన్ని పరిశీలించిన కలెక్టర్

గోనెగండ్లలో జరుగుతున్న రీసర్వే పనులనుకలెక్టర్ రంజిత్ భాష శనివారం పరిశీలించారు. అధికారులు చేపడుతున్న రీసర్వే విధానాన్ని, తహశీల్దార్ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అపోహలు లేకుండా రీసర్వే కొనసాగించాలన్నారు. రైతులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.
Similar News
News March 13, 2025
రేపు పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమిపూజ

పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది. ఈయూనిట్ ప్రారంభమైతే తమకు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
News March 13, 2025
భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు

భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బుధవారం కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.
News March 13, 2025
ప్రభుత్వ సేవలకు లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలి: కలెక్టర్

మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్ఎమ్ఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను బుధవారం ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎం అధ్యక్షతన నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి లబ్ధిదారుల్లో సంతృప్తి ఉండాలని సూచించారు.