News August 17, 2024

రుణమాఫీపై కావాలని రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి తుమ్మల

image

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్నవారు పై మొత్తాన్ని కడితేనే రూ. 2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ పై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోని బాకీలను కూడా చెల్లించామన్నారు. రైతులను మోసం చేసే సంస్కృతి తమ ప్రభుత్వానిది కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Similar News

News September 18, 2024

ఖమ్మం: మిర్చి @ రూ.20,000

image

వరుస సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మార్కెట్లో మిర్చి ధర క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

News September 18, 2024

కరకగూడెం:భార్యతో గొడవ.. భర్త సూసైడ్

image

భార్యతో గొడవపడి పురుగులు మందు తాగి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకొని మృతిచెందిన ఘటన కరకగూడెం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన కోవాసి సురేశ్ తన భార్యతో గొడవపడి మనస్తాపం చెంది మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలిపారు.

News September 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
>ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: అదనపు కలెక్టర్
>ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొంగులేటి
> ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోంది: మంత్రి తుమ్మల
>దళితబంధు చెక్కులను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
> పాల్వంచ:గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని
> వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ