News August 28, 2024
రుణమాఫీపై ఫిర్యాదులు, రంగంలోకి అధికారులు

రైతు రుణమాఫీ ఫిర్యాదులపై వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఖమ్మం జిల్లాలో మాఫీ వర్తించని కుటుంబాలను నిర్ధారించే ప్రక్రియ బుధవారం నుంచి చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.2లక్షల లోపు రుణాలు కలిగిన రైతు కుటుంబ సభ్యుల వివరాలను పంట రుణమాఫీ పోర్టల్లో అధికారులు నమోదు చేయనున్నారు. జిల్లాలో సుమారు 50వేల కుటుంబాలకు ఇవాల్టి నుంచి నిర్ధారణ ప్రక్రియ మొదలుకానుంది.
Similar News
News November 28, 2025
ఖమ్మం పల్లెల్లో ఎన్నికల జ్వరం..!

ఖమ్మం జిల్లాలో ఎన్నికల నియమాలు అమల్లోకి రావడంతో, పల్లెల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? అన్న మాటలే మార్మోగుతున్నాయి. ప్రజలు గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, కుటుంబ బలం, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేసుకుంటూ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
News November 28, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో ముమ్మరంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ
∆} ఖమ్మం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} ముదిగొండలో ఎన్నికల నిబంధనలపై ఏసీపీ అవగాహన కార్యక్రమం
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News November 28, 2025
నాణ్యమైన విద్య అందేలా చూడండి: డీఈఓ చైతన్య జైని

ఖమ్మం జిల్లాలోని 28 పీఎం శ్రీ పాఠశాలల HMలతో డీఈఓ చైతన్య జైని గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను వారికి తప్పక అందించేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని HMలను డీఈఓ ఆదేశించారు.


