News August 28, 2024
రుణమాఫీపై ఫిర్యాదులు, రంగంలోకి అధికారులు
రైతు రుణమాఫీ ఫిర్యాదులపై వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఖమ్మం జిల్లాలో మాఫీ వర్తించని కుటుంబాలను నిర్ధారించే ప్రక్రియ బుధవారం నుంచి చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.2లక్షల లోపు రుణాలు కలిగిన రైతు కుటుంబ సభ్యుల వివరాలను పంట రుణమాఫీ పోర్టల్‌లో అధికారులు నమోదు చేయనున్నారు. జిల్లాలో సుమారు 50వేల కుటుంబాలకు ఇవాల్టి నుంచి నిర్ధారణ ప్రక్రియ మొదలుకానుంది.
Similar News
News September 10, 2024
మళ్ళీ పెరిగిన పత్తి ధర….ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000, క్వింటా పత్తి ధర రూ.7,900 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
News September 10, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
> వరదలపై వైరా ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష
>భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
>ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు
>అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
>పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
>సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News September 10, 2024
పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని కూనంనేని కామెంట్స్ చేశారు.