News July 31, 2024
రుణమాఫీ కాలేదా? ఆందోళన చెందకండి: కలెక్టర్లు

అర్హత ఉన్నా రుణమాఫీ కాని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అన్ని మండలాల్లో ఫిర్యాదుల విభాగాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని, రైతులు ఫిర్యాదు చేయాలని, దరఖాస్తులను పరిశీలించి, వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామన్నారు. రెండు విడతలలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలు మంజూరు కావాల్సి ఉంది.
Similar News
News January 14, 2026
పాలమూరు: బొటానికల్ గార్డెన్‌లో అరుదైన పుట్టగొడుగు

జడ్చర్ల డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ మరో అరుదైన జీవజాతికి నిలయమైంది. ఇక్కడ ‘కాప్రినొప్సిస్ నివియా’ అనే అరుదైన పుట్టగొడుగును ప్రొఫెసర్ సదాశివయ్య బృందం గుర్తించింది. దీని ఫలనాంగాలు మంచు రంగులో ఉండి, మంచుతో కప్పబడినట్లు కనిపిస్తాయి. అందుకే దీనిని ‘స్నోయి ఇంకాంప్’ అని పిలుస్తారు. ఒకటి లేదా రెండు రోజుల్లోనే తన జీవిత చక్రాన్ని ముగిస్తుందని ప్రొఫెసర్ వివరించారు.
News January 14, 2026
పాలమూరు: ఈనాటి ముఖ్య వార్తలు!!

✒T-20 లీగ్.. అదిలాబాద్ పై మహబూబ్ నగర్ ఘనవిజయం
✒అభివృద్ధి కేంద్ర నిధులతోనే: ఎంపీ డీకే అరుణ
✒ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు
✒పలు గ్రామాల్లో క్రీడా పోటీలు
✒పాలమూరు: రోడ్డు ప్రమాదం.. తల్లీకుమార్తె మృతి
✒GDWL:భార్య కాపురానికి రావడంలేదని గొంతు కోసుకున్న భర్త
✒నాగర్‌కర్నూలు: ఐదుగురు ఏఈఓల సస్పెన్షన్
✒ఈనెల 19 నుంచి జోగులాంబ బ్రహ్మోత్సవాలు
News January 13, 2026
MBNR: సిరి వెంకటాపూర్‌లో 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత స్వల్పంగా తగ్గింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో అత్యల్పంగా 17.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకద్రలో 15.5, కొల్లూరులో 17.9, కౌకుంట్ల 18.0, సల్కర్‌పేటలో 18.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన కొద్దిరోజులతో పోలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో జిల్లా ప్రజలకు చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది.


