News June 14, 2024
రుణమాఫీ.. పాలమూరులో ఇదీ పరిస్థితి

ఆగస్టు 15లోగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తామనడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల బాకీలు తీరుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5,49,108 మంది రైతులకు రూ.2,736.76 కోట్ల మేర బ్యాంకులు రుణాలిచ్చాయి. గత ప్రభుత్వం రూ.లక్ష వరకు విడతల వారీగా రుణమాఫీ చేసింది. ముందుగా రూ.50వేల లోపు వారికి, రూ.99 వేల వరకు మాఫీ చేసింది. తాజాగా సీఎం ఆదేశాలతో అధికారులు గైడ్ లైన్‌పై దృష్టి పెట్టారు.
Similar News
News November 17, 2025
బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: MBNR SP

శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని మహబూబ్ నగర్ SP జానకి సూచించారు. చలికాలంలో పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని వివరించారు. బైక్ నడిపై వారు తప్పనిసరిగా హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించాలన్నారు.