News August 8, 2024

రుణ మంజూరులో జాప్యం.. రైతన్నలకు ఇక్కట్లు

image

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా ఉంది జిల్లాలో బ్యాంక్ అధికారుల తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.50 లక్షల లోపు రైతు మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే బ్యాంక్ అధికారులు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి వెంటనే నూతన రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ రైతులకు నూతన రుణాలు అందించడంలో జిల్లాలోని పలు బ్యాంకుల అధికారులు తీవ్ర జాప్యం చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News September 17, 2025

స్వాతంత్య్ర పోరాటంతో RSSకు సంబంధం లేదు: బృందాకారత్

image

భారత స్వాతంత్ర్య పోరాటంతో బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ స్పష్టం చేశారు. నల్గొండలో జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

News September 16, 2025

బాలికపై అత్యాచారం.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు

image

నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల ఊశయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పు చెప్పారు. రూ.40 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

News September 16, 2025

నల్గొండ: అంగన్వాడీ టీచర్ల పోరుబాట

image

సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగానే అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర, 17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.