News March 6, 2025
రుద్రంగికి పోలీస్‌స్టేషన్ మంజూరు

రుద్రంగి పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2.50కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌ను కోరగా.. ఆయన స్పందించి నిధులు విడుదల చేయించారు.
Similar News
News January 25, 2026
NRPT: సంక్షేమ పథకాలపై ‘విలేజ్ విజిట్’ సర్వే: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలను ఆల్ ఇండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విలేజ్ విజిట్ ప్రోగ్రాం ద్వారా సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ స్కీం సర్వే నిర్వహిస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో సర్వే చేస్తారని అన్నారు.
News January 25, 2026
బాలల సంరక్షణకు శాఖల సమన్వయం అవసరం: కలెక్టర్ వెట్రిసెల్వి

బాలల సంరక్షణకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బాలల సంక్షేమం-సంరక్షణ కమిటీ సమావేశంలో బాలల రక్షణపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఆదరణ అవసరమైన బాలలు, చట్టంతో విభేదించిన బాలలు, జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్‌లోకి వచ్చే పిల్లల సంరక్షణపై అధికారులు శ్రద్ద చూపాలన్నారు.
News January 25, 2026
విశాఖ ఉక్కు పరిశ్రమను తుక్కు చేస్తున్న యాజమాన్యం

విశాఖ ఉక్కు పరిశ్రమను యాజమాన్యమే తుక్కు చేస్తోందన్న విమర్శలు తారా స్థాయికి చేరాయి. పరిశ్రమలో భారీగా <<18950015>>పూల్డ్ ఐరన్<<>> వృథా అవుతోందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 50 రోజులుగా సగటున రోజుకు వెయ్యి టన్నుల హాట్ మెటల్‌ను నేలపై పోసి పూల్డ్ ఐరన్‌గా మార్చారు. 3 వారాల్లో మొత్తం 18,240 టన్నుల హాట్ మెటల్ వృథా అయినట్లు అంచనా. గత వారంలో ఒక్కరోజే 3,135 టన్నులు పారబోయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.


