News February 2, 2025
రుద్రంగి:నిర్లక్ష్యంగా వైద్యం చేసిన పీఎంపీ.. సెప్టిక్ గాయానికి గురైన బాలిక

రుద్రంగిలో ఓ బాలికకు పీఎంపీ చేసిన వైద్యం వికటించింది. బాలికకు దెబ్బ తగలగా ఆమె తల్లిదండ్రులు ఓ పీఎంపీ వైద్యుడి వద్దకు చికిత్స కోసం తీసుకెళ్లడంతో ఆ వైద్యుడు బాలికకు ఇంజక్షన్ వేశాడు. గాయం తగ్గకపోవడంతో మళ్లీ ఇంజక్షన్లు వేశాడు. చేసిన ఇంజక్షన్లు వికటించి బాలికకు సెప్టిక్ కావడంతో కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంజక్షన్ వికటించి సెప్టిక్ అయిందని, సర్జరీ అవసరం అని డాక్టర్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
భద్రాద్రి రామయ్యకు స్వర్ణతులసి పూజలు

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు శనివారం స్వర్ణతులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్యబలిహరణం తదితర నిత్యపూజలు చేశారు. స్వామివారి నిత్యకళ్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకువచ్చి నిత్యకళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News July 6, 2025
జులై 6: చరిత్రలో ఈరోజు

1901: భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జననం
1930: ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జననం(ఫొటోలో)
1985: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ జన్మదినం
1986: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం మరణం
2002: వ్యాపారవేత్త ధీరుభాయ్ అంబానీ మరణం
News July 6, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.