News January 27, 2025

రుద్రంగిలో మళ్లీ దొంగల బీభత్సం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మళ్లీ దొంగల బీభత్సం మొదలైంది. మండల కేంద్రానికి చెందిన అవునూరి వజ్రవ్వ అనే మహిళ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ముదిరాజ్ సంఘం భవనంలో కిరాయి ఉంటుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చొరబడి సుమారు రూ.10వేల వరకు అపహరించారని తెలిపింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 14, 2025

NLG: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు: జిల్లా ఎస్పీ

image

నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని సెయింట్ ఆల్ఫన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ యుగంలో యువత చిన్న వయస్సులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News November 14, 2025

నేరేడుచర్ల ఎస్సైకి ఎస్పీ అభినందన

image

నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సందర్భంగా ఎస్పీ నరసింహ, ఎస్సై రవీందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడి మరణించిన బాలిక మృతదేహాన్ని వెలికితీయడంలో ఎస్సై రవీందర్ వేగంగా స్పందించి, బాధ్యతతో పనిచేసినందుకు ఈ ప్రశంసలు లభించాయి. పోలీసు బృందం సమయస్ఫూర్తి ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొన్నారు.

News November 14, 2025

జగిత్యాల: మెగా జాబ్ మేళా.. 350 మందికి ఉద్యోగాలు

image

జగిత్యాలలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 1,000 మంది మహిళా నిరుద్యోగులు పాల్గొన్నారు. అందులో 350 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం విధుల్లో చేరేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.