News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్తో బాలుడి మృతి

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు <<16016221>>ఫుడ్<<>> పాయిజన్తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి తల్లి పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిని వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 9, 2025
రసవత్తరంగా పల్లెపోరు.. విందులతో ఓటర్ల మచ్చిక

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లెపోరు రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ గ్రామాల్లో బరిలో నిలిచిన నేతలు ఎవరికివారు గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. పార్టీలు, వినోదాలు ఆఫర్ చేస్తూ అందరినీ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి చికెన్, మటన్ పార్సిల్స్ పంపిస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రతి ఛాన్స్ను ప్రచారానికి వినియోగించుకుంటున్నారు.
News December 9, 2025
ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే..

TG: సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు గడువు సమీపించింది. నేటితో 4,236 స్థానాల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అవకాశం ఉంది. అటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి నుంచి ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొలి విడత పోలింగ్ సాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.
News December 9, 2025
గర్భిణులకు ఎంసీపీ కార్డులేవు.. తాత్కాలికంగా జిరాక్స్ కార్డులు అందజేత

మాతా శిశు మరణాలను సున్న శాతానికి చేర్చడమే లక్ష్యమని వైద్య శాఖ ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు కానీ కనీసం గర్భిణులకు వివరాలను నమోదు చేసే కార్డులను సమకూర్చలేని దుస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. గర్భిణులు సొంత ఖర్చుతోనే పాత వాటిని జిరాక్స్ తీస్తున్నారు. నార్నూర్, గాదిగూడ పీహెచ్సీలో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గర్భిణులకు ఎంసీపీ కార్డులు అందజేయాలని కోరుతున్నారు.


