News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్తో బాలుడి మృతి

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసి నిహాల్ తేజ (6) అనే బాలుడు ఫుడ్ పాయిజన్తో సోమవారం ఉదయం వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి <<16017744>>తల్లి<<>> పుష్పలత మృతి చెందగా.. కుమారుడు సోమవారం మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం ఇంట్లో చపాతీలు చేసుకుని తిన్నాక వాంతులయ్యాయి. చికిత్స పొందుతూ తల్లి, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 2, 2025
డిప్యూటీ సీఎం పరిగి పర్యటన వాయిదా

పరిగి నియోజకవర్గంలో జరగాల్సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. ముందుగా సోమవారం జరగాల్సిన ఈ పర్యటన ఇప్పుడు బుధవారానికి జరుగనుంది. పరిగి పరిధిలో 400 KV, ఆరు 33/11 KV సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేసి, నజీరాబాద్ తండాలో 220 KV సబ్స్టేషన్ ప్రారంభించి, రూ.8 కోట్లు విలువైన వ్యవసాయ విద్యుత్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.
News November 2, 2025
అక్కయ్యపాలెంలో భార్యాభర్తలు సూసైడ్

విశాఖ ఫోర్త్ టౌన్ పరిధిలో ఆదివారం విషాదం నెలకొంది. అక్కయ్యపాలెం సంగం ఆఫీసు సమీపంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. మృతులు వాసు, అనితగా గుర్తించారు. అనిత ప్రస్తుతం ఏడో నెల గర్భిణిగా ఉందని సమాచారం. వారి మృతదేహాలను చూసి వాసు తల్లి సొమ్మసిల్లి పడిపోయారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.
News November 2, 2025
నదుల పక్కన ఇంటి నిర్మాణాలు చేయవచ్చా?

వాగులు, నదుల పక్కన ఇల్లు కట్టుకోవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. జల ప్రవాహాలు ఎక్కువైతే.. ఆస్తి, ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. ‘నీటి ఒత్తిడి వల్ల పునాదుల బలం తగ్గి, ఇంట్లో స్థిరత్వం లోపిస్తుంది. ప్రకృతి శక్తుల వైపరీత్యం నుంచి ఇల్లు సురక్షితంగా ఉండాలంటే, వరుణ దేవుని ఆగ్రహానికి గురికావొద్దంటే ఈ స్థలాలను నివారించాలి. భద్రత కోసం వీటికి దూరంగా ఉండటం ఉత్తమం’ అని చెప్పారు. <<-se>>#Vasthu<<>>


