News April 7, 2025

రుద్రంగి: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

image

 ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది. 

Similar News

News September 17, 2025

రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.

News September 17, 2025

దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: GWL కలెక్టర్

image

జోగులాంబ సన్నిధిలో జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు. ఈ నెలలో జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News September 17, 2025

మెదక్: ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

image

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాల భారతదేశంలో విలీనమై ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించిందని వివరించారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజల పాలన వైపు వచ్చిన ఈ పరివర్తన ప్రజాస్వామ్య శక్తికి ప్రతీక అన్నారు.