News September 15, 2024
రుద్రూర్: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు

రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Similar News
News October 25, 2025
నవీపేట్: పెట్రోలు పోసి మహిళ హత్య

నవీపేట్ మండలం నాగేపూర్ శివారులో మహిళను దారుణ హత్య చేశారు. నిజాంసాగర్ కాలువ పక్కన ఓ మహిళ హత్యకు గురైనట్లు గురువారం రాత్రి సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు మద్దేపల్లికి చెందిన శ్యామల లక్ష్మి(45)గా గుర్తించారు. ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News October 24, 2025
NZB జిల్లాలో మద్యం దరఖాస్తులు ఎన్నంటే..?

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియగా జిల్లాలోని 102 షాపులకు గానూ 2,786 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఒక్కో టెండర్కు రూ.3 లక్షల చొప్పున రూ.83.58కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
News October 24, 2025
NZB: 138 పేకాట కేసుల్లో 599 మంది పట్టివేత:CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 19 నుంచి 22 వరకు 138 పేకాట కేసులు నమోదు చేసి 599 మందిని పట్టుకున్నట్లు CP సాయి చైతన్య గురువారం తెలిపారు. ఈ కేసుల్లో రూ. 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. NZBడివిజన్లో 42 కేసులు, ARMRడివిజన్లో 44 కేసులు, బోధన్ డివిజన్ లో 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.


