News April 2, 2025
రుద్రూర్: యువకుడి అదృశ్యం

రుద్రూర్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టు ఎస్ఐ సాయన్న తెలిపారు. గత ఏడాది ఇల్లు కట్టడానికి అప్పులు కావడం వల్ల విజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గత నెల 11న ఇంట్లో నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య మంగళవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 7, 2025
NZB: ఖిల్లా రామాలయంలో ట్రాన్స్ జెండర్ల వివాహం

శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.
News April 6, 2025
ఆర్మూర్: పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన సీపీ

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద 2వ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదివారం సందర్శించారు. ఇక్కడి పిరమిడ్ విశిష్టతను సీపీకి వివరించామని PSSM జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సీఐ సత్యనారాయణ, PSSM సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
News April 6, 2025
NZB: పండుగ పూట తీవ్ర విషాదం

బైక్ అదుపు తప్పి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు బైక్‌పై మోర్తాడ్ నుంచి భీమ్‌గల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో జాగిర్యాల్ గ్రామ శివారులో రోడ్డుపై అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ముక్కుకి తీవ్రగాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.