News October 29, 2024
రుద్రూర్: రెండు ఉద్యోగాలు సాధించిన విశ్వప్రసాద్

రుద్రూర్కు చెందిన గందే విశ్వప్రసాద్ రెండు ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో సోషల్ స్టడీస్ విభాగంలో జిల్లా స్థాయిలో ఆరో ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం అమ్దాపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా నిన్న విడుదలైన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో జేఎల్గా ఎంపికయ్యాడు.
Similar News
News October 27, 2025
నిజామాబాద్: రేపు 12 సోయబిన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇప్పటికే జిల్లాలో వరి, మొక్క జొన్న ధాన్ సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సోయాబీన్ రైతుల సౌకర్యార్థం కూడా జిల్లాలో మంగళవారం 12 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
News October 27, 2025
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: ఎంపీ

లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా గత ఐదు, పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో గన్ కల్చర్ పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దన్నారు.
News October 27, 2025
NZB: ‘లక్కీ’ డ్రా లో 18 మంది మహిళలకు వైన్స్లు

నిజామాబాద్ జిల్లాలోని 102 మద్యం షాపులకు సోమవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సారధ్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో 18 మంది మహిళలకు వైన్స్లు వరించాయి. గెజిట్ సీరియల్ నం.NZB-5, 7, 9, 16, 22, 50, 53, 57, 65, 69, 71, 78, 79, 82, 85, 86, 88, 97 షాపులు డ్రాలో మహిళలకు దక్కాయి. ఇందులో ఒక మహిళకు సాటాపూర్-1, పోతంగల్ షాపులు దక్కడం విశేషం.


