News March 25, 2025
రుయా ల్యాబ్లో లైంగిక వేధింపులు?

తిరుపతి రుయాలో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ల్యాబ్లో ఇద్దరు టెక్నీషియన్లు తమను లైంగికంగా వేధిస్తున్నారని పారా మెడికల్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ ఇద్దరిని ప్రిన్సిపల్ బదిలీ చేసి వారిపై విచారణకు ఆదేశించారు.
Similar News
News December 7, 2025
తల్లయిన హీరోయిన్ సోనారిక

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్ను వివాహం చేసుకున్నారు.
News December 7, 2025
స్క్రబ్ టైఫస్పై భయాందోళన చెందాల్సిన అవసరం లేదు: VZM కలెక్టర్

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధిని గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని VZM కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కళ్లు ఎర్రబడటం, దగ్గు, వాంతులు, పొట్టలో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలన్నారు. గ్రామాల్లో సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు.
News December 7, 2025
తెలంగాణ దిశా దశను మార్చనున్న గ్లోబల్ సమ్మిట్: పొంగులేటి

TG: రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దిశా దశను మార్చనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉన్నత నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. సుమారు 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారని చెప్పారు.


