News February 18, 2025
రుయ్యాడిలో కత్తిపోట్ల కలకలం.. ఒకరి మృతి

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. మండలంలోని రుయ్యాడి గ్రామంలో ఓ వ్యక్తి మంగళవారం కత్తిపోటుకు గురయ్యారు. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవలో మహేందర్ అనే వ్యక్తిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.
Similar News
News March 28, 2025
గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. పరిసర ప్రాంతాల, కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
News March 28, 2025
భువనగిరి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనార్టీ విద్యార్థులు పోస్టుమట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 28, 2025
జగిత్యాల: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో జగిత్యాల జిల్లాలో 3,07,555 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.