News August 8, 2024
రుషికొండ: ఈనెల 21కి విచారణ వాయిదా
పర్యావరణ అనుమతులు లేకుండా రుషికొండపై భవనాల నిర్మాణంపై బాధ్యుల మీద కేసు నమోదు చేసేలా మంగళగిరి పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టీ.గంగాధర్ పిటిషన్ దాఖలు చేశారు. గత జూన్ 23న అప్పటి సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి పలువురు మంత్రులపై ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడింది.
Similar News
News September 19, 2024
సింహాచలం ఈవోగా వి.త్రినాథరావు
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానమునకు కార్యనిర్వహణ అధికారిగా వి.త్రినాథరావును నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్వర్వుల జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈవోగా పని చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తన మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో త్రినాథరావు వచ్చారు.
News September 19, 2024
స్వర్ణాంధ్ర-2047పై సమీక్ష నిర్వహించిన విశాఖ కలెక్టర్
స్వర్ణాంధ్ర-2047పై అందరికీ అవగాహన ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం స్వర్ణాంధ్ర-2047పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై ప్రణాళికలతో కూడిన నివేదికలను రూపొందించాలన్నారు. ప్రతి ఏటా 15% ఆర్థిక పురోగతి కనిపించాలన్నారు.
News September 19, 2024
విశాఖ: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?
ఉమ్మడి విశాఖ జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన అన్ని సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు MLAలు ప్రజలకు వివరించనున్నారు. పెన్షన్ పెంపు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలనలో, మీ MLA పనితీరుపై మీ కామెంట్..