News March 23, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ

image

రుషికొండ బీచ్ తన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందింది. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బ్లూ ఫ్లాగ్ ఇండియా జాతీయ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్, బ్లూ ఫ్లాగ్ ఇండియా జ్యూరీ సభ్యుడు అజయ్ సక్సేనా విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కుఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని శనివారం అందజేశారు.

Similar News

News January 9, 2026

జిల్లా రివ్యూలో ఎమ్మెల్యే పల్లా సూచనలు

image

జిల్లా రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రభుత్వం సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. మెడికల్ అండ్ హెల్త్ విభాగం పరిధిలో నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు, మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు పరిశీలించాలన్నారు.

News January 9, 2026

విశాఖ: గాలి నాణ్యత పెరిగేందుకు చర్యలు

image

విశాఖలో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన DRC సమావేశంలో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమన్నారు. టార్పలిన్లు లేకుండా బొగ్గు, ఇసుక, ఇతర సామగ్రిని రవాణా చేయొద్దని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 9, 2026

విశాఖ కలెక్టరేట్లో నగర అభివృద్ధిపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించనున్నారు. భూ కేటాయింపులు, శంకుస్థాపనలు, అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.