News March 2, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు

image

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు అయ్యింది. బీచ్ నిర్వహణ అధ్వానంగా మారడంతో ఎస్ఈకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గుర్తింపు రద్దు చేసి జెండాలను కిందకి దించేశారు. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్‌గా ధ్రువీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ న్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్(ఎఫ్ఈఈ) సంస్థ సర్టిఫికెట్ అందించింది.

Similar News

News March 21, 2025

విశాఖ మేయర్ పీఠం కదలనుందా? 

image

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్‌ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.

News March 21, 2025

ఓవర్ హీట్: విశాఖ జూలో ఉపసమన చర్యలు

image

వేసవి ఉష్ణోగ్రతలు మండుతున్న నేపథ్యంలో జూలో వన్యప్రాణులు ఎండ వేడిమి తిట్టించుకునేందుకు జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చింపాంజీలు, టైగర్స్, లయన్, జీబ్రా, జిరాఫీలు, ఎలిఫెంట్స్, వివిధ రకాల పక్షులు మొదలైన వాటికి ఎండవేడిమి తట్టుకునేలా, వాటర్ స్ప్రింకలర్స్ ఏర్పాటు చేశారు. లోపల ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లు, కస్ కస్ మ్యాట్లు, తాటాకు పందిర్లు పెట్టారు. వేడి నుంచి ఉపశమనం కలిగేందుకు ఇవి దోహదపడుతున్నాయి.

News March 21, 2025

విశాఖ – భద్రాచలం ప్రత్యేక బస్సులు

image

శ్రీరామ నవమి సందర్భంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఆయన తెలిపారు. భక్తుల కోరిక మేరకు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.

error: Content is protected !!