News March 3, 2025
రుషికొండ బ్లూఫ్లాగ్ గుర్తింపుపై అసెంబ్లీలో ప్రస్తావించిన గంటా

రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంపై భీమిలి MLA గంటా శ్రీనివాసురావు అసెంబ్లీలో ప్రస్తావించారు. విశాఖకు ముఖ్యమైన IT, టూరిజంని అభివృద్ధి చేయాలని కోరారు. ఒకసారి బ్యాడ్ రిమార్క్ వస్తే ఇంటర్నేషనల్ టూరిస్టులు వెనుకడుగు వేస్తారని అన్నారు. ఈ నాలుగైదు రోజుల్లో బ్లూఫ్లాగ్ కమిటీ వస్తుందని ఆ టైంకి పునరుద్ధరించాలన్నారు. రద్దుకు కారణం ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
News July 6, 2025
ప్రచార రథం ప్రారంభమయ్యేది అప్పుడే

జులై 9న మ.2 గంటలకు సింహాచలం గిరిప్రదక్షిణ ప్రచారరథం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథరావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వద్ద అశోక్ గజపతి చేతుల మీదుగా ప్రచారరథం ప్రారంభమవుతుందన్నారు. ఆరోజు రాత్రి 11 గంటలకు రథం ఆలయానికి చేరుకుంటుందని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వరకు దర్శనాలు ఉంటాయన్నారు.
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.