News June 17, 2024
రుషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు: అమర్నాథ్
జగన్ ప్రభుత్వం రుషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకుల ప్రచారం చేయడం తగదన్నారు. నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు.
Similar News
News October 8, 2024
విశాఖ: స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రితో సీఎం చర్చ
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే అంశంపై కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఢిల్లీలో సీఎం అధికార నివాసంలో మంగళవారం కేంద్రమంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు.
News October 8, 2024
విశాఖ జిల్లాలో “పల్లె పండగ” వారోత్సవాలకు ప్రణాళిక సిద్ధం
విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు “పల్లె పండగ” వారోత్సవాలను ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన సమీక్ష కలెక్టర్ మాట్లాడారు. రూ.29 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ పరిధిలో 322 పనులకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు.
News October 8, 2024
విశాఖ: టెట్ పరీక్షకు 4165 మంది అభ్యర్థుల హాజరు
జిల్లాలో ప్రశాంతంగా టెట్ పరీక్షలు జరుగుతున్నట్లు డీఈఓ చంద్రకళ తెలిపారు. మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. మంగళవారం టెట్ పరీక్షకు 4614 మంది పరీక్షలు రాయాల్సి ఉందన్నారు. అయితే 4165 మంది పరీక్ష రాశారని ఆమె పేర్కొన్నారు. ఉదయం 5 కేంద్రాల్లో మధ్యాహ్నం 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కాగా తాను రెండు కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిందన్నారు.