News November 19, 2024

రుషికొండ భవనాలపై మీ కామెంట్?

image

వైసీపీ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కోట్ల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ విలాసాలకు భవనం నిర్మించుకున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు కోసం వాటిని నిర్మించామని వైసీపీ నాయకులు ఆ ఆరోపణలకు తిప్పికొడుతున్నారు. అయితే ఆ భవనాలను రాష్ట్ర ఆదాయ వనరులుగా మలచాలని పలువురు సూచిస్తున్నారు. మరి భవనాలు దేనికి వినియోగిస్తే బాగుంటుందో కామెంట్ చెయ్యండి.

Similar News

News January 3, 2026

విశాఖ: సోమవారం నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

image

విశాఖ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో జనవరి 5 నుంచి 9 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 1.09 లక్షల తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ల (MBU) పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగే ఈ సదుపాయాన్ని విద్యార్థులు, ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

News January 3, 2026

విశాఖ: సొంత భవనంలోకి NIO ప్రాంతీయ కార్యాలయం

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫి విశాఖ ప్రాంతీయ కార్యాలయం త్వరలో సొంత భవనంలోకి మారనుంది. సముద్ర తీర పరిశోధనల కోసం 1976 నుంచి పెదవాల్తేరు బస్‌ డిపో సమీపంలో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీచ్‌ రోడ్డులోని రాడిసన్ బ్యూ రిసార్ట్ సమీపంలో 3 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 3, 2026

విశాఖ: న్యూఇయర్ రోజు మర్డర్.. కారణం ఇదేనా?

image

విశాఖ జిల్లా కాకానినగర్‌లో న్యూఇయర్ రోజు <<18740809>>దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్‌ తమను తిట్టాడనే కారణంతో ఈ ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేసి చంపినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ శంకర్ నారాయణ శనివారం తెలిపారు.