News November 19, 2024

రుషికొండ భవనాలపై మీ కామెంట్?

image

వైసీపీ హయాంలో నిర్మించిన రుషికొండ భవనాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కోట్ల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ విలాసాలకు భవనం నిర్మించుకున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు కోసం వాటిని నిర్మించామని వైసీపీ నాయకులు ఆ ఆరోపణలకు తిప్పికొడుతున్నారు. అయితే ఆ భవనాలను రాష్ట్ర ఆదాయ వనరులుగా మలచాలని పలువురు సూచిస్తున్నారు. మరి భవనాలు దేనికి వినియోగిస్తే బాగుంటుందో కామెంట్ చెయ్యండి.

Similar News

News December 10, 2024

విశాఖ: వాయువ్య పశ్చిమ దిశగా అల్పపీడనం

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణము కొనసాగించి బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరుకొనే అవకాశముందని వెల్లడించారు. రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వారు పేర్కొన్నారు.

News December 10, 2024

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

image

వాతావరణ శాఖ అధికారులు తుఫాన్ హెచ్చరిక జారీచేసిన నేపథ్యంలో అనకాపల్లి కలెక్టరేట్‌లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ఇప్పటికే కోసిన వరి పనలు పొలాలపై ఉంటే ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.

News December 10, 2024

విశాఖలో యువకుడి ప్రాణం తీసిన రూ.2 వేలు

image

లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) ఓ యాప్ నుంచి అప్పు తీసుకున్నాడు. నగదు అంతా కట్టి చివరకు రూ.2 వేలు పెండింగ్‌లో ఉంది. అది కట్టలేదని అతడి ఫొటోలను మార్ఫింగ్ చేశారు. 40 రోజుల క్రితమే పెళ్లి అయిన తన భార్యకు సైతం వాటిని పంపారు. మనస్తాపానికి గురైన నరేంద్ర ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.