News July 8, 2024

రుషికొండ భవనాల వాడుక నీరు శుద్ధికి రూ.2.5 కోట్లు..!

image

రుషి కొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాల నుంచి వచ్చే వాడుక నీటిని శుద్ధి చేసేందుకు భారీ వ్యయంతో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మించారు. దీనిని నిర్మించినందుకు రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. దీనిని బీచ్ రోడ్డులోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం పక్కన నిర్మించారు. ఇందుకోసం అర కిలోమీటర్ మేర భూగర్భంలో పైపులైన్లను ఏర్పాటు చేశారు. అత్యంత విలువైన వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.

Similar News

News December 12, 2025

రోలర్ స్కేటింగ్‌లో విశాఖ క్రీడాకారిణికి గోల్డ్ మెడల్

image

విశాఖలో ‌63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో నగరానికి చెందిన క్రీడాకారిణి శ్రీ సాహితి బంగారు పతకం సాధించింది. ఈ పతకంతో శ్రీ సాహితి ఇప్పటివరకు106 పతకాలు సాధించినట్లు కోచ్ ఆకుల పవన్ కుమార్ వెల్లడించారు. VMRDA శాప్ అందించిన ప్రోత్సాహం విజయానికి దోహదపడ్డాయని శ్రీ సాహితి తెలిపింది.

News December 12, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో 19 ఫిర్యాదులు

image

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 19 వినతులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ చెప్పారు.

News December 12, 2025

విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

image

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్‌ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.