News August 30, 2024

రూంలో సీక్రెట్ కెమెరా పెట్టారా? ఇలా తెలుసుకోండి!

image

*సాకెట్స్, బల్బ్ హోల్డర్స్, గడియారాలు, మిర్రర్లు, అడాప్టర్లలో సీక్రెట్ కెమెరాలను ఉంచుతారు.
*రూంలోని అన్ని వస్తువులను క్షుణ్నంగా గమనించండి. అనుమానం వస్తే నిర్వాహకులకు ఇన్ఫార్మ్ చేయండి.
*రూంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మన ఫోన్ కెమెరా ఆన్ చేస్తే సీక్రెట్ కెమెరా ఉన్న చోట చిన్న లైట్ కనిపిస్తుంది.
*వీటిని కనిపెట్టేందుకు హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ కూడా ఉన్నాయి.

Similar News

News January 10, 2026

అమరావతిపై YCP వైఖరి పూర్తిగా మారినట్లేనా?

image

AP: అమరావతిపై <<18817916>>సజ్జల<<>> వ్యాఖ్యలతో రాజధానిపై ఆ పార్టీ వైఖరి పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ <<18799615>>కామెంట్ల<<>> తర్వాత YCP అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారనే టాక్ విన్పించింది. 3 రాజధానుల అంశం గత ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు పలుమార్లు ఆ పార్టీ నేతలు అన్నారు. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే జగన్ వ్యాఖ్యలపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై మీరేమంటారు.

News January 10, 2026

క్యాల్షియం ఎక్కువగా ఎందులో దొరుకుతుందంటే?

image

కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యాన్ని, బలాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. అలాగే ఆరెంజ్, ఆప్రికాట్, అంజీర పండ్లు, కివీ, స్ట్రాబెర్రీ, అరటిపండ్లలో క్యాల్షియం సమ‌ృద్ధిగా లభిస్తుంది. ఇవి ఎముకలు,దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయంటున్నారు నిపుణులు.

News January 10, 2026

ప్రయాణికుల కోసం ప్రత్యేక చర్యలు: కోమటిరెడ్డి

image

TG: సంక్రాంతికి ఊరెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేశాం. పంతంగి టోల్ గేట్ వద్ద మాత్రమే కాస్త రద్దీ ఉంది. విజయవాడ హైవేపై ఆరు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ హైవే డైరెక్టర్‌తో మాట్లాడాం. అక్కడ యంత్రాలను కూడా తొలగించారు’ అని తెలిపారు.