News August 30, 2024

రూంలో సీక్రెట్ కెమెరా పెట్టారా? ఇలా తెలుసుకోండి!

image

*సాకెట్స్, బల్బ్ హోల్డర్స్, గడియారాలు, మిర్రర్లు, అడాప్టర్లలో సీక్రెట్ కెమెరాలను ఉంచుతారు.
*రూంలోని అన్ని వస్తువులను క్షుణ్నంగా గమనించండి. అనుమానం వస్తే నిర్వాహకులకు ఇన్ఫార్మ్ చేయండి.
*రూంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మన ఫోన్ కెమెరా ఆన్ చేస్తే సీక్రెట్ కెమెరా ఉన్న చోట చిన్న లైట్ కనిపిస్తుంది.
*వీటిని కనిపెట్టేందుకు హిడెన్ కెమెరా డిటెక్టర్ లాంటి యాప్స్ కూడా ఉన్నాయి.

Similar News

News February 18, 2025

ఇన్ఫీ మా ట్రేడ్ సీక్రెట్లను దొంగిలించింది: కాగ్నిజెంట్

image

తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ TriZetto ట్రేడ్ సీక్రెట్లను దొంగిలిస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్టు కాగ్నిజెంట్ US కోర్టు ఫైలింగులో పేర్కొంది. తమ కంపెనీ, తమ CEO రవికుమార్ పోటీ విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని, తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ Infosys Helix గ్రోత్‌ను తగ్గించేలా సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఇన్ఫీ కౌంటరుకు ఇలా స్పందించింది. ఈ 2 కంపెనీల మధ్య చాన్నాళ్లుగా పోచింగ్ కేస్ నడుస్తోంది.

News February 18, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.79,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరగడంతో రూ.86,950లకు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.

News February 18, 2025

తక్కువ ధరకే ‘iPHONE 16 PRO MAX’.. ఎక్కడంటే?

image

యాపిల్ నుంచి కొత్తగా ఏ మోడల్ వచ్చినా కొనేందుకు జనం ఎగబడుతుంటారు. ప్రస్తుతం iPHONE 16 PRO MAX కాస్ట్లీయస్ట్. దీని ధరలు దేశాలను బట్టి మారుతుంటాయి. అయితే అతి తక్కువగా అమెరికాలో లభిస్తుంది. USలో కేవలం రూ.1.04లక్షలకే పొందొచ్చు. ఇక కెనడా & జపాన్‌లో రూ.1.07లక్షలు, హాంకాంగ్‌లో రూ.1.13 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.1.18 లక్షలు, చైనా& వియత్నాంలో రూ.1.19 లక్షలు, UAEలో రూ.1.20 లక్షలు, INDలో రూ.1.37 లక్షలుగా ఉంది.

error: Content is protected !!