News December 9, 2024
రూపం ఏదైనా తెలంగాణ తల్లి ప్రతిరూపమే: విజయశాంతి

TG: రూపం ఏదైనా బలిదానాలతో సాధించుకున్న ప్రతి తెలంగాణ తల్లి స్వరూపం మనకు ప్రతినిత్యం ప్రాతస్మరణీయం అని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. అమ్మోరు తల్లి లెక్క నూరు రూపాలైనా, ఏ రూపంలో ఉన్నా మన తెలంగాణ తల్లి ప్రతిరూపమే అని చెప్పారు. నిర్బంధాలను దాటుకొని 2007లో తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అయిందన్నారు. ఆ తర్వాత BRS, ఇప్పుడు కాంగ్రెస్ ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణ తల్లి ప్రతిరూపమే అన్నారు.
Similar News
News February 24, 2026
YCP హయాంలో హిందూమతంపై దాడి: CBN

AP: వైసీపీ ప్రభుత్వంలో తిరుమలపైనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హిందూమతంపై దాడులు చేశారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘2,032 దేవాలయాలపై దాడి చేశారు. 59 విగ్రహాలు చోరీ అయ్యాయి. ఎన్నో చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారు. అంతర్వేది రథం దగ్ధాన్ని తేనెటీగల దాడి అని చెప్పారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు’ అని వివరించారు. ఎవరైనా దేవాలయాల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
News February 24, 2026
PHOTOS: ‘కల్కి-2’ షూటింగ్‌లో అమితాబ్, కమల్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కల్కి-2 షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సెట్‌లో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ జాయిన్ అయ్యారు. అమితాబ్ సాదరంగా కమల్‌ను ఆలింగనం చేసుకొని ఆహ్వానించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే హీరో ప్రభాస్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
News February 24, 2026
ఈ అలవాట్లతో డేంజర్!

జీవనశైలిలో చేసే కొన్ని పొరపాట్లు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘6 గంటల కంటే తక్కువ నిద్ర, గంటల తరబడి కూర్చోవడం, రాత్రిపూట ఫోన్ వాడటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గి డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, BP/షుగర్ కంట్రోల్‌లో లేకపోతే మెదడు కణాలు దెబ్బతింటాయి. గురకను నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్ రావొచ్చు. వీటి వల్ల మెదడు వయసు పెరుగుతుంది’ అని చెబుతున్నారు.


