News March 1, 2025
రూల్స్ అతిక్రమిస్తే జరిమానా: సీపీ రాజశేఖరబాబు

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,000 జరిమానా, 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 డి ప్రకారం ఈ మేరకు రూ.1,000 జరిమానా విధిస్తామని, బైక్లు నడిపేవారు హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని సూచించారు.
Similar News
News October 27, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 106 దరఖాస్తులు

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వివిధ మండలాల దరఖాస్తుదారుల నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అర్జీలను స్వీకరించారు. అనంతరం, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు మొత్తం 106 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News October 27, 2025
ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధించాలి: కలెక్టర్

నంద్యాల జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధించాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ అభిప్రాయాలను సేకరించాలన్నారు. రాష్ట్రంలోనే మెరుగైన శాతాన్ని సాధించాలన్నారు.
News October 27, 2025
NTR: జర్మనీలో ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు చేసుకోండి

APSSDC ఆధ్వర్యంలో జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు. ఐటీఐ, డిప్లొమా ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసి, 2 ఏళ్ల అనుభవం కలిగి 30 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి కలిగినవారు https://naipunyam.ap.gov.in/user-registrationలో నవంబర్ 2లోపు నమోదు చేసుకోవాలని, వివరాలకు 9985759304లో సంప్రదించాలన్నారు.


