News September 4, 2024
రూ.కోటి విరాళం ప్రకటించిన అనకాపల్లి ఎంపీ

వరద ముంపు బాధితులకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బాసటగా నిలిచారు. విజయవాడ బాధితులకు సీఎం రమేశ్ కుటుంబం కోటి రూపాయల విరాళం ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోలుకోలేని విధంగా నష్టం జరిగిందన్నారు. సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 3, 2026
విశాఖ: సొంత భవనంలోకి NIO ప్రాంతీయ కార్యాలయం

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫి విశాఖ ప్రాంతీయ కార్యాలయం త్వరలో సొంత భవనంలోకి మారనుంది. సముద్ర తీర పరిశోధనల కోసం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలో అద్దె భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్యూ రిసార్ట్ సమీపంలో 3 ఎకరాల్లో నూతన భవన నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 3, 2026
విశాఖ: న్యూఇయర్ రోజు మర్డర్.. కారణం ఇదేనా?

విశాఖ జిల్లా కాకానినగర్‌లో న్యూఇయర్ రోజు <<18740809>>దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్ తమను తిట్టాడనే కారణంతో ఈ ఇద్దరు యువకులు కర్రలతో దాడి చేసి చంపినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ శంకర్ నారాయణ శనివారం తెలిపారు.
News January 3, 2026
విశాఖ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

విశాఖ జిల్లాలో 20 ఉద్యోగాలకు ప్రభుత్వం <


